ఆంధ్ర కళాసమితి - పన్వేల్

ANDHRA KALA SAMITHI - PANVEL

Regd. No. F 1626 (Raigad) Public Trust Act - 1950

Plot No 30, Sector -2,
New Panvel,
Navi Mumbai,
Maharashtra.410206

Andhra kala Samithi-Panvel Building
Bammera Pothana
Telugu Talli
Andhra Pradesh Assembly
kakatiya Kala Thoranam, Warangal Fort
Ramappa Temple, Warangal
Sri Venkateswara Temple, Tirupati
Charminar, Hyderabad
Buddha Statue, Hyderabad
Hitech City, Hyderabad

YOGA: (యోగ)

పతంజలి మహర్షి యోగని ఎనిమిది భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి అయిదు ధ్యాన సాధనలో బాహ్యంగా సహాయపడితే, చివరి మూడు అంతర్గత శక్తులను వెలికి తీసేందుకు దోహదం చేసి, యోగ సాధన ఫలాలను యిస్తాయి.

ఎనిమిదివిధానాలు:

యమ: ఒక సైనికుడి ఆయుధాలను అప్పగించినప్పుడు ముందుగా క్రమశిక్షణ నేర్పుతారు. ఎప్పుడు వాటిని ప్రయోగించాలి అనే విషయంతో పాటు సమాజ పరిరక్షణకు, శాంతి స్థాపనకు ఎలా ఉపయోగపడాలనేది అవగతం చేసుకుంటారు. జీవిత విధానంపై, ప్రవర్తనపై నిర్దిష్టమైన క్రమశిక్షణ ఉండాలి.

ఆఅయిదుఅంశాలు:

  • అహింస
  • సత్యం
  • బ్రహ్మచర్యం
  • దొంగతనానికిపాల్పడకపోవడం.
  • కోరికలను అదుపులో ఉంచుకోవడం

ఈ అయిదు అంశాలను పాటించినప్పుడే యోగ సాధకుడు ముందు అడుగు వేయగలడు.

నియమాలు: యోగ సాధన ఈ దేహంతోనే చేయవలసి ఉంటుంది. అందువల్ల శరీరం రోగగ్రస్తం కాకూడదు. ఆరోగ్యంగా, ధృఢంగా ఉండాలి. ప్రకృతిలోని ఎటువంటి మార్పులని అయినా తట్టుకునే శక్తి కలిగి ఉండాలి. వాంఛలు అదుపులో ఉండాలి. సాధకుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలగాలి. ఆ అనంత శక్తిని తెలుసుకోవాలనే జ్ఞానతృష్ణ కలిగి ఉండాలి.

పతంజలి మహర్షి సూచించిన అయిదు నియమాలు ఇవి:-

  • పరిశుభ్రత
  • సంతృప్తి
  • సంయమం
  • ధర్మశాస్త్రాలఅధ్యయనం
  • ప్రతి చర్యను భగవత్‌ అర్పితం చేయడం

ఈ అయిదు నియమాలను పాటించడంతో సాధకుడికి మానసికంగా, శారీరకంగా ప్రయోజనంచేకూరుతుంది.

ఆసనాలు: ప్రస్తుత కాలంలో యోగ పేరు చెప్పగానే అందరూ యోగాసనాల గురించే మాట్లాడుతున్నారు. హఠయోగంలో ఆసనాలు ఒక భాగం. పతంజలి మహర్షి ఏనాడూ యోగాసనాలు పాటించాలని ఖచ్చితంగా చెప్పలేదు. కేవలం విశ్రాంతిగా, స్థిరంగా కూర్చొనే ఆసనాన్ని మాత్రమే సూచించారు పతంజలి. పద్మాసనం కూడా అనుమతించారు. ఆసనాలతో శరీరంలోని భౌతిక పరమైన ఇబ్బందులు తొలగుతాయి. వేడి, చలిలాంటి ఉష్ణోగ్రత స్థితులపై అదుపు లభిస్తుంది. హఠయోగంలో పేర్కొన్న ఆసనాలను పాటించడంలో ఎటువంటి వ్యతిరేకత లేదు కాని, అత్యున్నతమైన సమాధి స్థితిని చేరుకోవడానికి యిది ప్రామాణికం కాదు.

ప్రాణాయామం: హఠ యోగంలో పేర్కొన్న వ్యాయామాల గురించి, పతంజలి మహర్షి ఎలా నొక్కి చెప్ప లేదో, అలాగే శ్వాసక్రియ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. కేవలం ఏకాగ్రతతో, నెమ్మదిగా, గాఢంగా ఊపిరి పీల్చి వదలడం మాత్రమే ఆయన సూచించారు. ఇలా ఉచ్ఛాశ్వ, నిశ్వాస క్రియ చేయడం వల్ల ఇంద్రియాలపై అదుపు ఏర్పడుతుంది. ఏకాగ్రతని వ్ధృది చేస్తుంది. అనునిత్యం సాధనం చేయడం వల్ల మాత్రమే యిది సాధ్యపడుతుంది.

ప్రత్యాహార: ఇంద్రియ నిగ్రహమే ప్రత్యాహార. ఇంద్రియ నిగ్రహం అంటే కేవలం వాంఛల నియంత్రణ, వైరాగ్యం పెంపొందించుకోవడం, ధర్మశ్త్రాసాల్లో చెప్పినట్లు నడుచుకోవడమే కాదు. నిరంతర ఏకాగ్రత సాధనతో జాగ్రదావస్థని దాటి వుండటం. మెదడుని అదుపులో ఉంచడానికి నిరంతరం హృదయం, ఇంద్రియాలు ప్ర్నయతిస్తుంటాయి. వాటిని జయించడానికి పైన చెప్పినట్లు నిరంతర సాధన, ఏకాగ్రత అవసరం.

ధారణ: సాధనలో పై అయిదు దశలు దాటాక, శరీరం, శ్వాసక్రియ, మనసు సాధకుడి అదుపులోకి వస్తాయి. ఇప్పుడు ఏకాగ్రతపై దృష్టి నిలపాలి. సాధకుడు ఓ ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని, ఓ నిరిద్దష్టమైన వస్తువుపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రతి రోజూ యిలా సాధన చేయడం వల్ల సాధకుడు ఏకాగ్రతలో ఓ ఉన్న్థతసితిని చేరుకుంటాడు.

ధ్యానం: ఆలోచనల ప్రవాహానికి ఆనకట్ట వేయడానికి ధ్యానాన్ని మించినది లేదు. ధ్యానంలో ఒక వస్తువుపై దృష్టి నిలిపినప్పుడు, క్రమేపీ ఆలోచనలు అంతరిస్తాయి. తనకి, ఎదురుగా వున వస్తువుకి తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ దశలో ఇంద్రియాలు, మనసు కూడా ఆ ్తవసువు వైపే లగ్నమవుతాయి. ఏకాగ్రత అనేది సహజసిద్ధంగా ఏర్పడుతుంది. ఇదొక అత్యున్నత స్థితి. ఈ స్థితికి చేరుకున్నాక సమస్యలను అర్ధం చేసుకోవడమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా గోచరిస్తాయి.

సమాధి: ధ్యానానికి, యోగికి యిదే పతాకస్థాయి. సాధకుడు తను అనే అహాన్ని మరిచి, ఏ శక్తిని/వస్తువుని తన దృష్టి లగ్నంగా చేసుకున్నాడో ఆ శక్తి, తాను ఒకటే అనే స్థితికి చేరుకుంటాడు. హద్దులన్నింటినీ దాటుకుని, ఈ ఉన్నతస్థితికు చేరుకున్న వ్యక్తిని ‘యోగి’ అంటారు. సమాధి స్థితికి చేరుకున్న సాధకుడు ప్రకృతిని అర్ధం చేసుకోవడమే కాదు, స్పర్శించగలడు, ప్రకృతిలోని ప్రతి అణువులోనూ అనుభూతి చెందగలడు.

ఈ అపూర్వ శక్తితోనే వేద ఋషులు కంప్యూటర్ల వంటి సాంకేతిక సహకారం లేని కాలంలోనే నాలుగు లక్షల సంవత్సరాలకు ఒకసారి గ్రహాలన్నీ ఒకే రేఖలోకి వస్తాయని, అదే యుగాంతమని కనుగొన్నారు.

In Telugu:

www.maatelugu.com

In English:

Yoga Resource Centre including Videos

Sahaja Yoga:

Sahaja Yoga

Pranaayam - Baba Ramdev

Sri Sri Ravinshankar